14-04-2025 10:15:24 PM
సంఘీభావం తెలిపిన ఉద్యమకారులు...
కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లాకు సూపరిచితుడు, మిత్రుడు, తెలంగాణ ఉద్యమకారుడు, కాంట్రాక్ట్ హక్కుల పరిరక్షణ సంఘం ప్రెసిడెంట్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్, రాసూరి శంకర్ సోమవారం సాయంత్రం రుద్రంపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. ఉద్యమకారుడిని, చూసి,ఉద్యమ నేతలు, కార్మికుల గుండెలు, చేదిరాయి. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శంకర్ ను వెంటనే సింగరేణి హాస్పిటల్ తరలించారు, అతని పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా ఆరోగ్యం మరింత క్షనించడంతో ఖమ్మంలోని ఆరోగ్య హాస్పిటల్ లో చేర్పించారు.
అతన్ని పరిశీలించిన డాక్టర్లు మరణించాడని ధృవీకరించారు. ఆయన మరణం తెలంగాణ ఉద్యమకారులు జీర్ణించుకోలేని పరిస్థితి. అయన మరణం కాంట్రాక్టు, సింగరేణి కార్మిక లోకానికి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి, తీరని లోటని, అతని కుటుంబానికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం,బిఆర్ఎస్,పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ తెలిపారు.