24-02-2025 12:53:29 AM
ఆమనగల్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి ): ఫోర్త్ సిటీ ఏర్పాటుతో కల్వకుర్తి నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పథం లో దూసుకెళుతుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ముందు చూపుతో ముచ్చర్ల లో ఫోర్త్ సిటీ ఏర్పాటు చేశారని.... ప్రత్యేకంగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనా ధ్యేయంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆదివారం ఆమనగల్ పట్టణంలోని కళ్యాణ్ గార్డెన్ లో బ్లూ ఓషియన్ కంపెనీ ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగమేలా నిర్వహించారు.
కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. నిరుద్యోగ యువత ఇట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని కడ్తాల్,ఆమనగల్,వెల్దండ,తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో అరులైన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రత్యేకంగా వృద్ధిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. బ్లూ ఓషియన్ ఇంటర్నేషనల్ కంపెనీ మంచి పేరు ఉన్న కంపెనీ అని మన నియోజకవర్గంలో మహిళా ఉద్యోగ మేళా పెట్టడం అభినందనీయమని ఆయన కొనియాడారు. కంపెనీ నిర్వాహకులు రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ తమ కంపెనీ హెడ్ ఆఫీస్ చెన్ను మరియు ఆంధ్రలో ఉందని నూతనంగా తెలంగాణలోని ప్రారంభించామని,ఈ ప్రాంతంలో కూడా మా కంపెనీ యొక్క కార్యకలాపాలను ప్రారంభించినట్లు ఆయన గుర్తు చేశారు.
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఫాక్స్ కాన్ కంపెనీ... బ్లూ ఓషియన్ ఏజెన్సీ ద్వారా కంపెనీలో మహిళలకు యోగాల కల్పనకు అనుసంధానంగా వ్యవహరిస్తుందని చెప్పారు. పదో తరగతి విద్యాబ్యాసం కలిగిన 18 నుంచి 30 సంవత్సరాలలోపు వారంతా ఇట్టి ఉద్యోగాలకు అరులని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత మహిళల కు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగానికి ఎంపికైన వారికి... కంపెనీ ఉచిత రవాణా, భోజన వసతి, ఐ పి ఎఫ్ ఉచితంగా ఉచిత బస్సు సౌకర్యం,కంపెనీలో భోజనం,మెడికల్ సౌకర్యం కల్పించడంతోపాటు ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారం వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో రాష్ర్ట పొల్యూషన్ బోర్డ్ మెంబర్ బాలాజీ సింగ్, అమనగల్ మార్కెట్ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహా,డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి,అమనగల్ మాజీ మార్కెట్ చైర్మన్ నారాయణ,తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకురి ప్రభాకర్ రెడ్డి,ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులు శ్రీకాంత్ వారి బృందం,బ్లూ ఓసీయన్ ప్రతినిధులు మంగబాబు,సుబ్బారావు,మణిరత్నం,కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.