calender_icon.png 30 April, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ.. ప్రపంచానికి దిక్సూచి

28-04-2025 12:31:48 AM

  1. ప్రపంచానికి ప్రాణం పోయడమే మా లక్ష్యం 
  2. భారత్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ 

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ‘తెలంగాణ వేదికగా వందకు పైగా దేశాలు.. వందల ఆలోచనలు.. సంఘర్షణలు.. లక్ష్యం ఒక్కటే.. ప్రపంచ ప్రజాస్వా మ్యానికి ప్రాణం పోయడం. ప్రజల హక్కులలో సమానత్వాన్ని చాటడం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దిశానిర్దేశంలో అభివృద్ధిలోనే కాదు.. ప్రజాస్వామ్య పునరుజ్జీవ నంలో సైతం ప్రపంచానికి తెలంగాణ దిక్సూచి’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాల పరిష్కారానికి ఏకమవుతామని.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని.. భారత్ సమ్మిట్‌లో చేసిన తీర్మానం గొప్పదని సీఎం ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాల వైఖరిని భారత్ సమ్మిట్‌లో ఖండించినట్టు చెప్పారు. కాగా, హైదరాబాద్‌లోని హెచ్‌సీసీలో ఈ నెల 25, 26 తేదీల్లో భారత్ సమ్మిట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమ్మిట్‌లో 100 దేశాల నుంచి 450 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.