“అందం కేవలం పోటీలకే మాత్రమే పరిమితం కాకూడదు. వ్యక్తిత్వం, ప్రతిభ, సామాజిక స్పృహను చాటాలి” అని అంటోంది ఫెమినా ‘ఫెమినా మిస్ ఇండియా 2024’ విజేత ప్రకృతి కంభం. ఇటీవల బెంగళూరులో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా’ పోటీల్లో టైటిల్ గెలుచుకొని విజేతగా నిలిచింది. మొదటిసారి ఆమె హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
“మా స్వస్థలంగా హైదరాబాద్. మా తండ్రి ఇక్కడే పుట్టి పెరిగారు. అందుకే హైదరాబాద్‌తో నాది పత్యేక అనుబంధం. నా చదవు బెంగళూరులో కంప్లీట్ అయింది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ్ భాషలు వచ్చు. జాతీయ వేదికపై సాంస్కృతిక విలువలు చాటిచెప్పడంతో అందాల పోటీలో నిలిచే అవకాశం దక్కింది. ఊహించనివిధంగా ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నా. ఈ పోటీలు జీవిత పాఠాలను నేర్పాయి. ఆత్మవిశ్వాసం నింపాయి.” అని ఆమె అన్నారు.