calender_icon.png 20 November, 2024 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్‌మెంట్ దశలో సొంత జిల్లాలకు తహసీల్దార్లు

29-06-2024 12:40:31 AM

బదిలీ చేసిన సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 28 (విజయక్రాంతి) : త్వరలో రిటైర్‌కానున్న తహసీల్దార్లను వారి సొంత జిల్లాలకు బదిలీ చేశారు. ఈ మేరకు సీసీఎల్‌ఏ కమిషనర్  నవీన్ మిట్టల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో మల్టీజోన్  మల్టీ జోన్  పరిధిలో కొందరు తహసీల్దార్లను బదిలీ చేశారు. అయితే, వారిలో కొందరు ఈ నెలలో, మరికొందరు వచ్చేనెల(జులై)లో రిటైర్ కానున్నారు.  ఈ క్రమంలో వారు అక్కడే ఉంటే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం ఆయా జిల్లాలకు తరచూ వెళ్లడం ఇబ్బందికరమని, ఈ సమస్య పరిష్కారం కోరుతూ గతంలో ఉద్యోగ సంఘాల నుంచి ప్రభుత్వానికి విన్నవించారు. ఎట్టకేలకు సానుకూలంగా స్పందించిన సర్కారు త్వరలో రిటైర్ కానున్న ఏడుగురు తహసీల్దార్లను వారి సొంత జిల్లాలకు అనుమతివ్వగా, సీసీఎల్‌ఏ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నిర్ణయంపై రెవెన్యూ ఉద్యోగ సంఘాల్లో హర్షం వ్యక్తమవుతోంది.  

మల్టీజోన్-1 పరిధిలో...

తహసీల్దార్ పేరు ప్రస్తుత జిల్లా సొంత జిల్లా

కే రాములు నిజామాబాద్ మెదక్

కే వేణుగోపాల్ మంచిర్యాల పెద్దపల్లి

డీ తిరుమలచారి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం

టీ శ్రీనివాసరావు మెదక్ సిద్దిపేట

మల్టీజోన్-2 పరిధిలో..

వీ రాంబాయి వనపర్తి మహబూబ్‌నగర్ 

రసూల్ జోగులాంబ గద్వాల్ సంగారెడ్డి

ఎన్. శ్రీనివాసులు నాగర్‌కర్నూల్ మహబూబ్‌నగర్