09-04-2025 12:08:56 AM
మందమర్రి, ఏప్రిల్ 8 : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద బడుగు బలహీన వర్గాలకు కడుపునిండా భోజనం అం దించేందుకు సన్న బియ్యం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టగా అధికా రులు క్షేత్రస్థాయిలో పథకం తీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. మంగ ళవారం మండల తహసీల్దార్ సతీష్ కుమార్ రెవెన్యూ అధికారులతో కలిసి పట్టణంలోని ఒకటో జోన్ కు చెందిన సన్న బియ్యం లబ్ధిదారురాలు పొన్న గంటి సుగుణ - లింగయ్య దంపతుల ఇంట్లో సన్నబియ్యంతో చేసిన వంట ను రుచి చూశారు. ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ తహశీల్దార్ రవీంద ర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గణపతి రాథోడ్ లు పాల్గొన్నారు.