మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తహశీల్దార్ రాఘవరెడ్డి ఎంపీడీవో శ్రీనివాస రావులు శనివారం పెద్దపల్లి గ్రామానికి చెందిన వలస ఆదివాసి గుత్తి కోయలకు ఆధార్ ఆధారిత ఫోటో ఓటర్ (ఏపీకే) కార్డును అందజేశారు. ఈ సందర్భంగా వారిని సత్కరించారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఆధారిత ఓటర్ కార్డును పొందాలని, ఓటు నమోదు చేసుకుని వారు వెంటనే తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.