20-03-2025 08:31:51 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని ఊత్కూర్ కు చెందిన సూరిమిళ్ల శాంతమ్మ అనే నిరుపేద భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేయగా తహసీల్దార్ దిలీప్ కుమార్ స్పందించి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బాధితురాలి భూమిని రక్షించి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే సూరిమిళ్ల శాంతమ్మకు తన భర్త ఆశీర్వాదం నుంచి విరాసత్ ద్వారా సంక్రమించిన సర్వే నంబర్ 362/రూ, విస్తీర్ణం 0.20 గుంటలను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేయడంతో ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది.
వెంటనే కలెక్టర్ ఆదేశాలతో బుధవారం భూమి మొఖాపైకి వెళ్లి ఆ భూమికి సరిహద్దులను తహసీల్దార్ దిలీప్ కుమార్ యుద్ధ ప్రతిపాదికన తన సిబ్బందితో కలిసి హద్దులు నిర్ణయించారు. అంతేకాకుండా ఇకపై శాంతమ్మ భూమిని ఎవరైనా కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు చేపడతామని తహసీల్దార్ దిలీప్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను హెచ్చరించారు. తన భూమి సమస్యను వెంటనే పరిష్కరించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తహసీల్దార్ దిలీప్ కుమార్ లకు శాంతమ్మ కృతజ్ఞతలు తెలిపారు.