13-02-2025 05:56:31 PM
రామయంపేట (విజయక్రాంతి): రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామం, పెద్ద తండాలో ఎండాకాలంలో నీటి ఎద్దడి నివారణలో భాగంగా స్పెషల్ ఆఫీసర్, మండల తహసిల్దార్ రజనీకుమారి త్రాగు నీటి ట్యాంకులను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ... ఎండాకాలంలో ఎండలు విపరీతంగా దంచికొడుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో త్రాగునీటి ఏద్దడికి నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
అదే విధంగా గ్రామ పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాలలో త్రాగునీటి ట్యాంకుల వద్ద వృధాగా నీరు పోకుండా నల్లాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. నీటిని వృధాగా గ్రామాలలో నల్లాలు లేకుండా రోడ్లపైకి, మురుగు కాలువల ద్వారా పారిస్తున్నట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ కిరణ్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.