10-04-2025 10:37:44 PM
మునగాల: మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో ఆఫీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎం.పీ.ఓ. దారా శ్రీనివాస్, ఇటీవల కాలంలో హార్ట్ స్ట్రోక్ తో విధి నిర్వాహణలో మృతి చెందారు, వారి జ్ఞాపకార్థ కూడిక కోదాడలోని శ్రీమన్నారాయణ కాలనీలో వారి నివాసంలో హాజరైన మండల తహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని వారిని ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఎన్ రామారావు, తిప్పని ఆంజనేయులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు టి చంద్రశేఖర్, పచ్చిపాల వెంకటేశ్వర్లు, దొంగరి సైదులు, కంప్యూటర్ ఆపరేటర్ మొలుగూరి రమేష్, ఎమ్మార్పీఎస్ & ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శిలు కొత్తపల్లి అంజయ్య, పాతకోట్ల నాగరాజు, లంజపల్లి శ్రీను, కత్తి శ్రీను, కత్తి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.