calender_icon.png 25 October, 2024 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముట్టడి

25-10-2024 03:34:14 PM

నిజాంసాగర్: ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు స్కాలర్షిప్ లను విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం  ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా జుక్కల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. జుక్కల్ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం తహసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్రంలో 6500 కోట్లు పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని గత అరేండ్ల నుండి ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్ షిప్స్  6500 కోట్ల పైన పెండింగ్ లో ఉన్నాయి. వాటిని విడుదల చేయకపోవడం వల్ల ప్రభుత్వం కళాశాలలో ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే యాజమాన్యలు డబ్బులు కట్టి తీసుకెళండి అన్ని చెప్తున్నారు.

ఈ విషయం ప్రభుత్వం దృష్టికి ప్రతిసారి తీసుకెళ్తున్నాము కానీ పట్టించుకోవట్లేదు అందుకే విద్యార్థులం అంత ఐక్యం అయి తక్షణమే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్  మరియు స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి, పెరిగిన ధరల అనుగుణంగా స్కాలర్ షిప్స్ పెంచి ఇవ్వాలి. ఈది SFI డిమాండ్ లేని యెడల ఇంకా ఎక్కువ ఉద్యమాలు, పోరాటాలు చేస్తాం అన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో ర్యాలీగా విద్యార్థులు జుక్కల్ భాషవేశ్వర్ చౌక్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదగా MRO కార్యాలయనికి చేరుకున్నారు. అనంతరం MRO కార్యాలయం ముట్టడించి 30నిముషాలు నుండి 50 నిమిషాల పాటు కూర్చున్నారు, వారి డిమాండ్స్ కొరకు తహసిల్దార్ హిమబిందుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండలం అధ్యక్షులు షైక్ ఫీర్దోస్ మండలం నాయకులు ఈశ్వర్, జేమల్, అక్షయ్, రాహుల్, విద్యార్థులు పాల్గొన్నారు.