calender_icon.png 18 March, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో వసతులను పరిశీలించిన తహసిల్దార్..

18-03-2025 04:46:16 PM

కాటారం (విజయక్రాంతి): ఈనెల 21 నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా కాటారం తహసిల్దార్ నాగరాజు పరిశీలించారు. మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం కోడ్ (08010), గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల (08011), ఆదర్శ విద్యాలయం (08012) పరీక్ష కేంద్రాలను తాసిల్దార్ పరిశీలించారు. భవనాలు, ఫర్నిచర్, త్రాగునీరు, మరుగుదొడ్లు, లైటింగ్ సీసీ కెమెరాల వసతులు అందుబాటులో గల వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారు.