17-04-2025 05:47:10 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని మునగాలలో మొద్దుల చెరువు స్టేజి వద్ద మహిళా సమాఖ్య ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులు అధికారులతో కలిసి గురువారం తహసీల్దార్ వి ఆంజనేయులు(Tahsildar Anjaneyulu) ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. దళారులకు తక్కువ ధరకు అమ్మే మోసపోవద్దు సూచించారు.
ఈ కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, మండల వ్యవసాయ అధికారి బుంగరాజు, ఏఈఓలు రమ్య తేజ, భవాని నాగు, మాజీ వైస్ ఎంపీపీ కె బుచ్చి పాపయ్య, మండల పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు, వేనేపల్లి వీరబాబు, సుంకరి పిచ్చయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ము ఈదరావ్, నారాయణ గూడెం మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, వేనేపల్లి వీరబాబు, కొండ రామంజి, ఐకెపి నిర్వాహకులు కిన్నెర సామ్రాజ్యం, నాగరాణి జయశ్రీ అశ్విని సైదులు తదితరులు పాల్గొన్నారు.