calender_icon.png 28 December, 2024 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

03-11-2024 12:56:18 AM

లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల తహసీల్దార్ తిరుపతి, పంచాయతీ కార్యదర్శి శేఖర్ శనివారం లంచం తీసుకుంటూ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి బృందానికి పట్టుబడ్డారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పోచంరెడ్డి గ్రామంలో రూ.9.11 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు బిల్లు మంజూరుకు కాంట్రాక్టర్ కేంద్రీ సుబోద్ కాంత్ నుంచి మండల ప్రత్యేకాధికారిగా విధులు నిర్వహిస్తున్న తహ సీల్దార్ దురశెట్టి తిరుపతి, పంచాయతీ కార్యదర్శి శేఖర్ లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన కాం ట్రాక్టర్.. వారి సూచ నతో శనివారం రూ.12 వేలు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు.