02-03-2025 12:37:05 AM
ఉత్తర్వులిచ్చిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జీ చిన్నారెడ్డి
హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): కులగణన నివేదికను తన యూట్యూట్ చానెల్ లైవ్ టెలికా స్ట్‌లో కాల్చడంతో పాటు పలువర్గాలపై అభ్యంతరక ర వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్‌కు మార్)పై కాంగ్రెస్ నాయకత్వం సస్పెన్షన్ విధించింది.
వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ గతనెల 6న కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులిచ్చా రు. షోకాజ్ నోటీసులకు ఫిబ్రవరి 12వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం కో రింది. తీన్మార్ మల్లన్న ఎలాంటి వివరణ ఇవ్వక పోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా మీనా క్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే మల్లన్నపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ నిబంధనలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే నాయకురాలిగా గుర్తింపు ఉన్న మీనాక్షి నటరాజన్.. ఈ నిర్ణయంతో పార్టీలైన్ దాటి తే ఎవరినీ ఉపేక్షించబోమని సంకేతాలు ఇచ్చారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది.
పార్టీ లైన్ దాటితే చర్యలు: పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
ఎంతటి నాయకులైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణ ముందు కులమతాల ప్రస్తావన ఉండదన్నారు. మల్లన్నకు పార్టీ అన్ని విధాలుగా సహకరించిందని.. అయినా ఆయన పార్టీ లైన్ దాటారని తెలిపారు. కులగణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయ్యిందన్నారు. రాహుల్‌గాంధీ ఆదేశాల తోనే తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ విధించారన్నారు.
మల్లన్న దారెటు!
కాంగ్రెస్ పార్టీ వేటువేయడంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏ దారిలో వెళ్తారన్న అంశమై రాజకీయవ ర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్‌లో చేరు తారని కొందరు.. బీజేపీలో చేరుతారని మరికొం దరు భావి స్తున్నారు. తెలంగాణలో తిరిగి పూర్వవై భవం దిశగా అడుగులు వేయాలని పావులు కదుపు తున్న టీడీపీ లోనూ చేరే అవకాశాలను కొట్టిపారేయ లేమని రాజకీ య విశ్లేషకులు అంచనావేస్తున్నారు. టీ
టీడీపీ అధ్యక్ష పదవి సైతం ఖాళీగా ఉండటం, బీసీ వాదానికి ఆ పార్టీ అనుకూలంగా ఉండటంతో ఆ వైపు ఆలోచించే అవకా శం ఉన్నట్లు పేర్కొంటున్నా రు. మరోవైపు బీజీపీ కూడా బీసీ ముఖ్యమంత్రి ని నాదంతో ముందుకెళ్తున్న తరుణం లో ఆ పార్టీలో నూ చేరే అవకాశం ఉందని వాపోతు న్నారు.
పైగా ఆయన గతంలో కొంతకాలం పాటు బీజేపీ లో ఉన్నా రు. మల్లన్న టీడీపీలో చేరికతో రాష్ట్రంలో ఆ పార్టీ బలపడితే మళ్లీ ప్రాంతీయ వాదం బలపడి బీఆర్ ఎస్ పుంజుకుంటుందన్న వాదన కూడా వినిపిస్తుంది.
సొంత పార్టీ ఆలోచన!
రాష్ట్రంలో రాజకీయమంతా బీసీ నినాదం చుట్టే తిరుగుతుంది. కులగణన పేరిట కాంగ్రెస్, ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటూ బీజేపీ బీసీల ను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. మల్లన్న ఏ పార్టీ వైపు మొగ్గు చూపని పక్షంలో సొంత పార్టీ పెట్టే అవకాశం కూడా ఉన్నట్టు రాజకీయంగా చర్చ సాగుతుంది.
అవసరమైతే బీసీలంతా కలిసి ఓ పార్టీ పెడతా మని ఇప్పటికే ఆర్ కృష్ణయ్య, వట్టే జానయ్య లాంటి బీసీ నేతలు బహిరంగంగా ప్రకటించారు. ఈ క్రమంలో వరగంల్ సభలోనే మల్లన్న కొత్త పార్టీ ప్రకటిస్తా రని జోరు ప్రచారం జరిగింది. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో కొత్త పార్టీ పెట్టే దిశగా మల్లన్న వేగంగా పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచా రం జరుగుతుంది. ఈ క్రమంలో బీసీ సంఘాల నాయకులతో చార్చిం చాక మల్లన్న అధికార ప్రకటన చేస్తారంటూ ప్రచారం నడుస్తోంది.