calender_icon.png 13 February, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షోకాజ్ నోటీస్‌కు తీన్మార్ మల్లన్న నో రిప్లె

13-02-2025 01:22:49 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వివరణ ఇవ్వలేదు. ప్రభుత్వం నిర్వహించిన కులగణన శాస్త్రీయంగా లేదని, బీసీల సంఖ్యను తక్కువగా చూపించారని కులగణన ప్రతులను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాల్చివేశారు.

అంతే కాకుండా ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన బీసీల సభలో ఒక కులాన్ని కించపరిచేలా మాట్లాడారని మల్లన్నపై కాంగ్రెస్ పార్టీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 12వ తేదీ వరకు వివరణ ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణ సంఘం మల్లన్నకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. బుధవారంతో గడువు ముగిసినప్పటికీ.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న షోకాజ్ నోటీసును పట్టించుకోలేదని పార్టీ వర్గాలు  చెబుతున్నాయి.