calender_icon.png 1 April, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీనేజ్ లవ్‌స్టోరీ మధురం

31-03-2025 12:08:25 AM

యంగ్ హీరో ఉదయ్‌రాజ్, వైష్ణవిసింగ్ జంటగా నటిస్తున్న టీనేజ్ లవ్‌స్టోరీ ‘మధురం’. ‘బస్‌స్టాప్’ ఫేమ్ కోటేశ్వరరావు, కిట్టయ్య, ఎఫ్‌ఎం బాబాయ్, దివ్యశ్రీ, సమ్యురెడ్డి, జబర్దస్త్ ఐశ్వర్య, ఉష, అప్పు, రామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీవేంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొం దుతున్న ఈ సినిమాకు ‘ఏ మెమొరబుల్ లవ్’ అనేది ట్యాగ్‌లైన్.

1990 నేపథ్యం లో జరిగే కథతో రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందు తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌తో సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మేకర్స్ తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రి ల్ 18న థియేటర్ల ద్వారా విడుదల కానున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రానికి కెమెరా: మనోహర్ కొల్లి; సంగీతం: వెంకీ వీణ; పాటలు: రాఖీ; ఎడిటర్: ఎన్టీఆర్; నిర్మాత: ఎం బంగార్రాజు; కథ ప్లే- రాజేశ్ చికిలే.