“బడ్డీ’ సినిమాలో టెడ్డీనే నిజమైన హీరో. నేను కాదు. ఈ విషయం చెప్పడానికి నాకు ఎలాంటి మొహమాటం లేదన్నారు” అల్లు శిరీష్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘బడీ’్డ. సామ్ యాంటన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై ౨౬న తెరమీదికి రానున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఏఏఏ థియేటర్లో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. “అన్యాయంపై తిరగబడిన టెడ్డీబేర్‌ని చూశారా.. చూస్తారా” అని సాయికుమార్ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ మొదలవ్వగా ఇందు లో ప్రతినాయకుడిగా అజ్మల్ అమీర్ అడిగిన ప్రశ్నకు “గెలిచేదాకా వస్తూనే ఉంటా” అని బదులిచ్చారు శిరీష్.
ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశానికి కథానాయికలైన గాయత్రి, ప్రిషా రాజేశ్ సింగ్, నటులు అలీ, అజ్మల్ అమీర్, నిర్మాతలు జ్ఞానవేల్‌రాజా, మధుర శ్రీధర్, ఎడిటర్ రాబిన్ తదితరులు హాజరయ్యా రు. ఈ సందర్భంగా హీరో శిరీష్ మాట్లాడుతూ “.సినిమా మొదలుపెట్టినపుడు రీమేక్ ఎందుకంటూ ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. వాటన్నిటికీ ఈ ట్రైలర్ సమాధానం అవుతుంది. కొత్తరకమైన కథలతో వస్తున్న సినిమాలకు ఇటీవల కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుంది” అన్న ఆయన, అభిమానుల కోరిక మేరకు అల్లు అయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తీసుకొస్తా అని వారికి మాటిచ్చారు. ఈ కార్యక్రమానికి చిన్నారి ఆరాధ్య (శ్రేయాస్ శ్రీనివాస్ కుమార్తె) వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.