calender_icon.png 29 November, 2024 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిసెంబర్ 2 నుంచి టాస్క్ సెంటర్ లో టెక్నికల్ ట్రైనింగ్ బ్యాచ్

29-11-2024 05:48:23 PM

డిగ్రీ/బీటెక్ ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులు టాస్క్ ట్రైనింగ్ నీ సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష..

పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలో ఏర్పాటు చేసిన టాస్క్ కేంద్రంలో మొదటి బ్యాచ్ శిక్షణ తరగతులు డిసెంబర్ 2 తారీఖు నుంచి ప్రారంభమవుతాయని, ఆసక్తిగల యువతీ యువకులు టాస్క్ రీజనల్ సెంటర్ లో క్లాసులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు. టాస్క్ అనేది పరిశ్రమకు నాణ్యమైన మానవ వనరులు, సేవలను అందించే లక్ష్యంతో పరిశ్రమలకు & అకాడెమియా మధ్య సమన్వయాన్ని తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన లాభాపేక్ష లేని సంస్థ టాస్క్. పెద్దపల్లి రీజినల్ సెంటర్‌ లో డిసెంబర్ 2 నుండి బ్యాచ్ డిగ్రీ / బిటెక్ ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులు శిక్షణ కోసం పేరు నమోదు చేసుకొని, తరగతులకు హాజరు కావాలని టాస్క్ రీజినల్ హెడ్ సవీన్ రెడ్డి తెలిపారు. టాస్క్ ద్వారా 10 రోజులు సాఫ్ట్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్  పై  శిక్షణ పూర్తి అయిన తరువాత ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం జరుగుతుందని టాస్క్ ప్రతినిధులు తెలిపారు. మరిన్ని వివరాలకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ - టాస్క్ పెద్దపల్లి (పాత జాగృతి మండల సమాఖ్య భవనం) 9182117078, 9395113738 ను సంప్రదించాలని కోరారు.