హైదరాబాద్,(విజయక్రాంతి): ఎల్బీనగర్-మియాపూర్ మెట్రో మార్గంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మెట్రో రైళ్లు ఎక్కడకక్కడ నిలిచిపోయాయి. ఎల్బీనగర్-మియాపూర్ మెట్రో మార్గంలో రైళ్లు నెమ్మదిగా నడుస్తుండడంతో స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగింది. విద్యుత్ ఫీడర్ ఛానల్ లో సాంకేతిక సమస్య వచ్చిందని మెట్రో అధికారులు పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు.