calender_icon.png 3 April, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసీల్దార్ కార్యాలయంలో సాంకేతిక లోపం

27-03-2025 06:32:55 PM

నిలిచిపోయిన యువ వికాసం దరఖాస్తుల అప్లోడింగ్ విధానం..

ఇబ్బంది పడుతున్న దరఖాస్తుదారులు...

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఇంటర్నెట్ సేవల్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యువ వికాసం పథకం అభ్యర్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే నిరుద్యోగ యువతీ యువకులు తహసీల్దార్ కార్యాలయంలో కులం, ఆదాయం సర్టిఫికెట్లతో పాటు ఇతర సర్టిఫికెట్లకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంటర్నెట్ సేవల్లో తలెత్తిన సాంకేతిక లోపం లబ్ధిదారులకు తలనొప్పిగా మారుతుంది.

గురువారం సాంకేతిక లోపం తలెత్తడంతో అభ్యర్థుల దరఖాస్తులను ఆన్లైన్లో పొందపరచలేకపోయామని తాహసిల్దార్ కార్యాలయ ఉద్యోగులు వాపోయారు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఆన్లైన్ విధానంలో సమస్య తలెత్తడంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. సాంకేతిక సమస్య తీరిన వెంటనే ధ్రువీకరణ పత్రల కోసం దరఖాస్తులు చేసుకునే లబ్ధిదారులకు సర్టిఫికెట్లను సిద్ధం చేసి అందిస్తామని కార్యాలయ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.