శ్రీవారిని దర్శించుకోవలసిన భక్తుల ఆందోళన
రాజేంద్రనగర్: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఎయిర్ వేస్ విమానం(Airways plane) సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. బుధవారం ఉదయం ఐదున్నర గంటలకు శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం తిరుపతికి బయలుదేరాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో సాంకేతిక లోపం(Technical error) తలెత్తిందని ఎయిర్పోర్ట్ వర్గాలు ప్రయాణికులకు సమాచారం అందించారు.
అనంతరం ఎంతసేపటికి వారు మరో ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయలేదు. తిరుమలకు వెళ్లాల్సిన వారిలో చాలామంది శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉండటంతో ఆందోళన వ్యక్తం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. తమ దర్శన సమయం దాటిపోతోందని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. తమ ఆవేదనను ఇబ్బందిని ఏర్పాటు వర్గాలు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో విమానాలు ఆగిపోతే ఎయిర్పోర్టు సిబ్బంది ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాల్సి ఉన్న కూడా ఆ విధమైన ఏర్పాట్లు చేయలేదు.