calender_icon.png 17 March, 2025 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిర్ ఏసియా విమానంలో సాంకేతిక లోపం

17-03-2025 01:32:34 AM

 సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండింగ్ 

రాజేంద్రనగర్, మార్చి 16: ఎయిర్ ఏసియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఏటీసీ అధికారులు సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారుల కథనం ప్రకారం.. కౌలాలంపూర్ నుంచి 73 మంది ప్రయాణికులతో ఎయిర్ ఏసియా విమానం హైదరాబాద్ బయలుదేరింది.

శనివారం అర్ధరాత్రి సమయంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోకి రాగానే విమానం గాలిలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే అప్రమత్తం అయిన పైలెట్ శంషాబాద్ విమానాశ్రయం ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చాడు.

అనంతరం ఎయిర్ ఏషియా విమానాన్ని సురక్షితంగా ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ చేశారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులతో పాటు ఎయిర్పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విమానం వెళ్ళిపోయింది.