25-04-2025 01:27:14 AM
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): సీతారామ ఎత్తిపోతల పథకానికి సాంకేతిక అనుమతులు లభించా యి. ఈ మేరకు వివిధ రాష్ట్రాలకు చెం దిన 5 ప్రాజెక్టులతో పాటు ఈ తెలంగాణకు చెందిన సీతారామ ప్రాజెక్టుకు కూడా అనుమతులివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ సిఫార్సు చేసింది.
గురువారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన టెక్నికల్ అప్రైజల్ కమిటీ (టీఏసీ) సమావేశంలో కేంద్ర జల్ శక్తి కార్యదర్శి నేతృత్వంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 1,68,196 హెక్టార్ల నూతన ఆయకట్టు కు సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు ద్వారా వైరా, లంకసాగర్, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్‌తో పాటు మరికొన్ని చిన్న నీటిపారుదల శాఖ చెరువుల పరిధిలోని 1,50,571హెక్టార్ల ఆయకట్టును స్థిరీకరించనున్నారు.
ప్రతిపాదిత సీతారామ ప్రాజెక్ట్ ద్వారా 3,18,767 హెక్టార్లకు (7.87 లక్షల ఎకరాలు) సాగునీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రాజెక్ట్ నుంచి 67 టీఎంసీల నీటిని ఎత్తిపోసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహ బూబాబాద్ జిల్లాలకు సాగు, తాగునీరు అం దించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోం ది. న్యూఢిల్లీలో జరిగిన టీఏసీ సమావేశంలో కార్యక్రమంలో తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ అనిల్ కుమార్, ఇంజినీర్లు పాల్గొన్నారు.
సీతమ్మ సాగర్‌కు 67 టీఎంసీలు కేటాయింపు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలోని సీతమ్మసాగర్ ప్రాజెక్ట్‌కు 67 టీఎంసీలు కేటాయిస్తూ కేంద్రం అధికారికంగా నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క మల్లు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దాంతో పాటు సీతమ్మ సాగర్ బరాజ్నిర్మాణానికి సాంకేతిక అనుమతులు మంజూరు చేసిందని ఆయన తెలిపారు.
రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో అధికారిక అనుమతులు లభించాయని కొనియాడారు. మంత్రి ఉత్తమ్ కృషితో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దఎత్తున బీడు భూములను సాగు చేసుకొనే అవకాశం ఏర్పడిందని భట్టి తెలిపారు. దశాబ్దాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నంతో అధికారిక అనుమతులు లభించడం ఆనందంగా ఉందన్నారు.