calender_icon.png 18 January, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెక్ మహీంద్రా లాభం రూ.989 కోట్లు

18-01-2025 01:52:04 AM

న్యూఢిల్లీ, జనవరి 17: దేశంలో ప్రధాన ఐటీ కంపెనీల్లో ఒకటైన టెక్ మహీంద్రా నికరలాభం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 89 శాతం వృద్ధిచెంది రూ. 989 కోట్లకు చేరింది. గత ఏడాది క్యూ3లో కంపెనీ రూ.524 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో టెక్ మహీంద్రా ఆదాయం 1.4 శాతం పెరిగి రూ.13,286 కోట్లకు చేరింది. ఆపరేటింగ్ లాభాల మార్జిన్ 13.1 శాతం నుంచి 13.6 శాతానికి మెరుగుపడింది. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం ఈ కంపెనీ షేరు 1.81 శాతం తగ్గి రూ. 1,658 వద్ద ముగిసింది.