calender_icon.png 7 January, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసక్తి పెంచేలా టీజర్ ప్రోమో

09-11-2024 12:00:00 AM

రామ్‌చరణ్, కియారా అద్వానీ జోడీతో దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ చేంజర్’ చిత్రం టీజర్ కోసం సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు న్నారు. కాగా, ఆ టీజర్ శనివారం విడుదల కానుంది. టీజర్ లాంచ్ వేడుకకు లక్నో వేదిక కానుంది. అనంతరం ఈ టీజర్‌ను తెలుగు రాష్ట్రాల్లోని 11 సెంటర్ల థియేటర్లలో రిలీజ్ చేస్తారు. అయితే, అంతకన్నా ముందే ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చింది చిత్రబృందం. టీజర్ ప్రోమో ను శుక్రవారం విడుదల చేసి మరింత ఆసక్తిని పెంచింది.

రామ్‌చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్ ప్రోమో విడుదలైంది. ఈ టీజర్ ప్రోమో 13 సెకన్ల నిడివితో ఉంది. ఇందులో బాయ్స్ హాస్టల్‌ను చూపించారు. రామ్‌చరణ్ ఫైటింగ్‌నూ చూపారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.