05-03-2025 01:27:27 AM
కోనరావుపేట, మార్చి 4: పంట పొలాలకు నీరు లేక ఎండిపోతున్నాయి. వ్యవసా య బావుల్లో భూగర్భ జలాలుఅడుగంటిపోయాయి. రైతుల కళ్ళలో నీరు నిండిపోయా యి. యాసంగి సాగుపై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశ మిగిలింది. పంటల సాగు నుండి రైతులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ బోరు బావులపై ఆధారపడి వరి పంట సాగు చేసిన రైతులకు కంట కన్నీరే మిగిలింది. పంట పొలాలన్నీ నీరు లేక ఎండిపోవడంతో పశువులకు మేతగా మారింది.
కోనరావుపేట మెట్ట ప్రాంతం అయినప్పటికీ, మలకపేట రిజర్వాయర్ తో పాటు నిమ్మపల్లి జలాశయం ఉన్నప్పటికీ బోరుబావుల పైన ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్నారు. ఇప్పటికే మొలకపాటి రిజర్వాయర్ లో 0.75 టీఎంసీ డెడ్ స్టోరేజ్ ఉన్నప్పటికీ, పూర్తిస్థాయిలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరు బావు లు నీళ్లు లేకబోరుమంటున్నాయి. రైతులు అత్యధికంగా వరి పంటపై సాగుపై మొగ్గు చూపడంతో, ఈ యాసంగిలో కూడా వరి పంటనే ఎక్కువగా సాగు చేశారు.
నిమ్మపల్లి, కోనరావుపేట, ఎగ్లాస్పూర్, శివంగలపల్లి, వట్టిమల్ల, బావుసాయిపేట్, నిజామాబాద్, మామిడిపల్లి, ధర్మారం కనగర్తి గ్రామాల్లో వరి పంట సాగు చేశారు. కొద్దిరోజులుగా వాతావరణం మార్పుల్లో భాగంగా ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువ ఉండడంతో పంట పొలాలకు సాగునీరు అందకపోవడంతో ఎండిపోతున్నాయి. దీంతో గత్యంతరం లేక రైతులు పశువులకు మేతగా పొలాలను వదిలిపెట్టారు. పెట్టిన పెట్టుబడులు మీద పడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీరు లేక ఎండిపోయిన పొలాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నా రు. ఇప్పటికే రైతులు లక్షలు వెచ్చించి బోరు బావుల్లో భూగర్భ జలాలు పెరిగేందుకు పూటిక తీసే పనిలో పడ్డారు. మరికొన్ని గ్రామాల్లో బోరు బావులు వేస్తున్నప్పటికీ భూగర్భ జలాలు అడగడంతో బోర్లని వట్టిపోతున్నాయి. ధర్మారం, పల్లిమక్త,నాగారం, సుద్దాల, వెంకటాపూర్, కొండాపూర్ పంట పొలాలు సాగునీరు లేకపోవడంతో ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి.
ధర్మారం గ్రామంలో వరి పంట ఎండిపోవడంతో మేకలు గొర్రెలకు మేత కోసం రైతులు వదిలిపెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎండిపోయే వరి పంట పొలాలపై సర్వే చేయించి పరిహారం అందించి, తమను ఆదుకోవాలని బాధ్యత రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.