calender_icon.png 21 March, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్రునయనాలతో మాజీ వైస్ ఎంపీపీ ప్రసాద్ కు అంతిమ వీడ్కోలు

20-03-2025 05:58:43 PM

గత స్మృతులు తలుస్తూ, కన్నీటి పర్వంతమైన ఎమ్మెల్యే దంపతులు..

పాడెమోసిన ఎమ్మెల్యే  కోరం కనకయ్య, వెంట కదిలిన కాంగ్రెస్ శ్రేణులు..

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి-కొత్తగూడెం హైవే రహదారిలోని బోరింగ్ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతి చెందిన టేకులపల్లి మాజీ వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్ కు గురువారం సులానగర్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వీరాభిమాని ఉండేటి ప్రసాద్ కావడంతో అంతిమయాత్రలో ఎమ్మెల్యే కనకయ్య కుటుంబ సభ్యులతో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. గత ముప్పై ఏళ్లుగా కోరం కుటుంబ సభ్యులతో మృతునికి గల అవినాభావ సంబంధాన్ని గుర్తుచేసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతిమయాత్రకు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తరలిరాగా, ఎమ్మెల్యే కోరం కనకయ్య నివాళులర్పించి స్వయంగా పాడే మోశారు. కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.