న్యూఢిల్లీ: భారత్ వేదికగా తొలిసారిగా జరగనున్న ఖో ఖో ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన భారత పురుషుల, మహిళల జట్లను ఈ నెల 8న ప్రకటించనున్నారు. పురుషుల జట్టును ఇండియా మహిళల జట్టును ఇండియా అభివర్ణించను న్నట్లు ఖోఖో ఫెడరేషన్ పేర్కొంది. జనవరి 13 నుంచి జరగనున్న టోర్నీలో 17న క్వార్టర్ ఫైనల్స్, 18న సెమీస్, 19న ఫైనల్ జరగనుంది. టోర్నీ ప్రారంభోత్సవం రోజున మస్కట్స్ టారా, తేజస్‌ను ఆవిష్కరించనున్నారు. టోర్నీలో మొత్తం 24 దేశాలు పాల్గొనుండగా.. 615 మంది ఆటగాళ్లు, 125 మంది సహాయక సిబ్బంది ఉన్నారు.