హైదరాబాద్: టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసి కప్పు కొట్టిన భారత క్రికెట్ జట్టు గురువారం స్వదేశానికి చేరుకోనుంది. బూర్జడోస్ నుంచి టీమిండియాను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. రేపు తెల్లవారుజామున టీమిండియా ఢిల్లీ చేరుకుంటుందని బీసీసీఐ ప్రకటించింది. భారత మీడియా ప్రతినిధులను తీసుకురానున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. తుపాను, ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా టీమిండియా బూర్బడోస్ లోనే ఉంది.