calender_icon.png 19 January, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీమిండియా సైన్యమిదే

19-01-2025 01:18:06 AM

  • చాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టు ఎంపిక
  • వన్డేల్లో అరంగేట్రం చేయనున్న జైస్వాల్
  • రీఎంట్రీ ఇవ్వనున్న మహ్మద్ షమీ
  • గిల్‌కు వైస్ కెప్టెన్సీ.. సిరాజ్‌కు మొండిచేయి

ముంబై: వచ్చే నెల 19 నుంచి జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. శనివారం ముంబైలో అజిత్ అగార్కర్ నేతృత్వంలో సమావేశమైన సెలెక్షన్ కమిటీ చాంపియన్స్ ట్రోఫీతో పాటు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా, శుబ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

కాగా చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టులో ఏమైనా మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 13 వరకు అవకాశముంది. చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఉన్న భారత్ తమ మ్యాచ్‌లన్నింటిని దుబాయ్ వేదికగా ఆడనుంది. బంగ్లాతో ఫిబ్రవరి 20న, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 23న, న్యూజిలాండ్‌తో మార్చి 2న మ్యాచ్ లు ఆడనుంది. దాదాపు ఎనిమిదేళ్ల కిందట (2017) జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో పాక్ విజేతగా నిలిచింది.

ఆనవాయితీ ప్రకారం ఆతిథ్య హక్కులు పాక్ దక్కించుకోగా.. భారత్ పాక్‌లో ఆడేం దుకు ససేమిరా అనడంతో ఐసీసీ భారత్ మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించనుంది. ఇప్పటివరకు రెండుసార్లు చాంపియన్స్ ట్రోఫీ దక్కించుకున్న భార త్ చివరగా ధోని నాయకత్వంలో 2013లో టైటిల్‌ను సొంతం చేసుకుంది.

కరుణ్ నాయర్‌కు దక్కని చోటు..

చాంపియన్స్ ట్రోఫీకి 15 మందితో ప్రకటించిన జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలిసారి వన్డే జట్టులోకి పిలుపు అందుకోగా.. గాయంతో జాతీయ జట్టుకు దూర మైన పేసర్ మహ్మద్ షమీ పునరాగమనం చేయనున్నాడు. మరో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసినప్పటికీ పూర్తి ఫిట్‌నెస్ ఉంటేనే చాంపియన్స్ ట్రోఫీలో బరి లోకి దిగుతాడని సెలెక్టర్లు తెలిపారు. దేశవాలీలో అమోఘంగా రాణిస్తోన్న కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్ , శాంసన్ లాంటి క్రికెటర్లకు నిరాశే ఎదురైంది.

ఓపెనింగ్‌లో రోహిత్‌తో పాటు జైస్వాల్  వీరికి బ్యాకప్‌గా గిల్ ఉండనున్నాడు. ఇక మిడిలార్డర్‌లో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ భారాన్ని మోయాల్సి ఉంటుంది. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ అతడికి బ్యాకప్‌గా రాహుల్ అందుబాటులో ఉండనున్నాడు. ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చోటు దక్కించుకోగా.. స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లు ఎంపికయ్యారు.

పేస్ దళంలో సిరాజ్‌ను పక్కనబెట్టిన బీసీసీఐ అర్ష్‌దీప్‌కు చాన్స్ ఇచ్చింది. సీనియర్ పేసర్లుగా షమీ, బుమ్రా బాధ్యతలు పంచుకోనున్నారు. ఇక హర్షిత్ రానాను ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు మాత్రమే ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలిపింది.  జట్టు ప్రకటన అనంతరం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి మీడియా సమావేశంలో పా ల్గొన్న రోహిత్ శర్మ రానున్న రంజీ సీజన్‌లో ముంబైకి అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నాడు. బుమ్రాపై వర్క్‌లోడ్ పేరుతో ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేలకు అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు అగార్కర్ తెలిపాడు.

భారత జట్టు: రోహిత్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), కోహ్లీ, జైస్వాల్, పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాండ్యా, జడేజా, అక్షర్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్ష్‌దీప్. హర్షిత్ రానా (ఇంగ్లండ్‌తో సిరీస్‌కు మాత్రమే).