స్వదేశంలో వరుసగా సిరీస్‌లు
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ కానుంది. జూలైలో జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడనున్న భారత జట్టు ఆ తర్వాత సెప్టెంబర్ 19 నుంచి ఫిబ్రవరి 12 వరకు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో స్వదేశంలో వరుస సిరీస్‌ల్లో పాల్గొననుంది. ఈ మేరకు గురువారం బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ 2023 జరగనున్న నేపథ్యంలో టీమిండియా స్వదేశంలో (ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు కాకుండా) మరో ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో బంగ్లాతో రెండు, న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో పాల్గొననుంది.
తొలుత బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 12 మధ్య రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 మధ్య న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది. అనంతరం నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా (నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు) అక్కడ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ (బోర్డర్ ఆడనుంది. ఆసీస్‌తో టెస్టు సిరీస్ ముగించుకొని వచ్చిన వెంటనే స్వదేశంలో ఇంగ్లండ్‌తో (జనవరి 22 ఫిబ్రవరి 12 వరకు) 5 టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.
టీమిండియా స్వదేశీ షెడ్యూల్
బంగ్లాదేశ్‌తో
తొలి టెస్టు: చెన్నె (సెప్టెంబర్ 19-23)
రెండో టెస్టు: కాన్పూర్ (సెప్టెంబర్ 27-అక్టోబర్ 1)
తొలి టీ20: ధర్మశాల (అక్టోబర్ 6)
రెండో టీ20: ఢిల్లీ (అక్టోబర్ 9)
మూడో టీ20: హైదరాబాద్ (అక్టోబర్ 12)
న్యూజీలాండ్‌తో
తొలి టెస్టు: బెంగళూరు (అక్టోబర్ 16-20)
రెండో టెస్టు: పుణే (అక్టోబర్ 24-28)
మూడో టెస్టు: ముంబై (నవంబర్ 1-5)
ఇంగ్లండ్‌తో
తొలి టీ20: చెన్నై (జనవరి 22)
రెండో టీ20: కోల్‌కతా (జనవరి 25)
మూడో టీ20: రాజ్‌కోట్ (జనవరి 28)
నాలుగో టీ20: పుణే (జనవరి 31)
ఐదో టీ20: ముంబై (ఫిబ్రవరి 2)
తొలి వన్డే: నాగ్‌పూర్ (ఫిబ్రవరి 6)
రెండో వన్డే: కటక్ (ఫిబ్రవరి 9)
మూడో వన్డే: అహ్మదాబాద్ (ఫిబ్రవరి 12)