05-03-2025 12:00:00 AM
3 భారత్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా మూడోసారి.
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం ఆస్ట్రేలియాతో జరి గిన సెమీఫైనల్‌లో రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో విజ యం సాధించింది. రోహిత్ శర్మ వరుసగా 14వ సారి టాస్ ఓడిపోగా.. టాస్ గెలిచిన ఆసీస్ మొదట బ్యాటిం గ్ చేసేందుకు మొగ్గుచూపింది.
ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (73), కేరీ (61) రాణించగా.. 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆ జట్టు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీ 3, వరుణ్, జడేజా చెరి 2, పాండ్యా, అక్షర్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఐదో ఓవర్లో షాక్ తగిలింది. ఓపెనర్ గిల్ (8) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.
రోహిత్ శర్మకు జతకలిసిన కోహ్లీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ (28) ఎనిమిదో ఓవర్లో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అయ్యర్‌తో కలిసి కింగ్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. ఈ జోడీ చొరవతో ఇండియాకు గెలుపు దక్కుతుందనే భావన కలిగింది.
ఇక చివర్లో రాహుల్ (42*) సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ముగించాడు. 84 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నేడు జరిగే సెమీఫైనల్-2 మ్యాచ్‌లో విజయం సాధించే జట్టుతో ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ తలపడనుంది. భారత్ ఇంకా ౧౧బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.