calender_icon.png 20 January, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబయిలో టీమిండియా క్రికెటర్ల రోడ్ షో

04-07-2024 05:55:19 PM

ముంబయి : టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. ముంబయిలో టీమిండియా క్రికెటర్ల రోడ్ షో గురువారం సాయంత్రం ప్రారంభమైంది. టీ20 ప్రపంచకప్ తో సగర్వంగా భారత్ వచ్చిన రోహిత్ సేనను ఓపెన్ టాప్ బస్సులో ముంబయి రహదారులపై ఊరేగిస్తున్నారు.

నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఈ రోడ్ షో జరుగుతుంది. క్రికెటర్లకు స్వాగతం పలికేందుకు భారీ అభిమానులు రోడ్లపైకి పోటెత్తడంతో మంబయి సముద్ర తీరంలా కనిపిస్తుంది. క్రికెటర్ల రోడ్ షో సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత క్రికెట్ జట్టును గురువారం కలిశారు. టీ20 ప్రపంచకప్ సాధించిన రోహిత్ సేనను  ప్రధాని మోదీ అభినందించారు.