calender_icon.png 22 February, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోణీ కొట్టిన టీమిండియా

21-02-2025 01:23:07 AM

  1. బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం
  2. గిల్ అజేయ శతకం.. షమీకి 5 వికెట్లు
  3. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ

దుబాయ్: ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసింది. గ్రూప్-ఏలో భాగంగా గురు వారం దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. వన్డే నంబర్‌వన్ బ్యా టర్ శుబ్‌మన్ గిల్ అజేయ శతకానికి తోడు షమీ ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత్ గెలుపు రుచి చూసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హృదోయ్ (100) సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో షమీ 5 వికెట్లతో చెలరేగగా.. హర్షిత్ 3, అక్షర్ 2 వికెట్లు పడగొట్టా రు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసి గెలుపొం దింది.

ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (101 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించగా.. రాహుల్ (47*) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.  బంగ్లా బౌలర్లలో రిషద్ హొసెన్ 2 వికెట్లు పడగొ ట్టాడు. కాగా భారత్ తమ రెండో మ్యాచ్‌లో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.