హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): నేటి తరం విద్యార్థులకు జ్ఞానార్జన ఎక్కువ అని, అందుకు అనుగుణంగా విద్యా బోధన చేయాలని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కళాశాల చైర్‌పర్సన్ ఏ రమాదేవి అన్నారు. కళాశాల ప్రాంగణంలో శనివారం ఆంధ్ర మహిళా సభ (ఏఎంఎస్) స్కూల్ ఆఫ్ ఇన్‌ఫర్మాటిక్స్ ఆధ్వర్యంలో మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఫలిత ఆధారిత విద్య అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.
కార్యక్రమానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ బీ రాజశేఖర్ వక్తగా హాజరై అంతర్జాతీయ, హైబ్రిడ్ విధానంలో అధ్యాపకు లకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓయూ సీసీబీఎంలో పాల్గొన్న వారికి ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ కే విజయలక్ష్మి, సెక్రటరీ వై సత్యనారాయణ, ప్రొఫెసర్ వీ సుధ, అధ్యాపకులు పాల్గొన్నారు.