calender_icon.png 13 March, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృత్రిమ మేధస్సుతో విద్యాబోధన సులభం

12-03-2025 10:37:33 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): కృత్రిమ మేధస్సుతో విద్యాబోధన సులభమని ఐటిడిఏ పివో బి.రాహుల్(ITDA PO B. Rahul) అన్నారు. బుధవారం బూర్గంపాడు మండలం సారపాకలోని గాంధీనగర్ ఎంపీపిఎస్ పాఠశాలలో కృత్రిమ మేధస్సుతో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చదువులో వెనుకబడిన పిల్లలను గుర్తించి అభ్యాసన మెరుగుపడడానికి, విద్యార్థుల స్థాయిని అంచనా వేయడానికి ఇది ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. అలాగే అభ్యాస కృత్యాలు ప్రతి విద్యార్థికి నిర్వహించడం వలన విద్యాభ్యాసం పట్ల పిల్లలలో మరింత ఉత్సాహం పెంపొందించవచ్చని, కఠినమైన పదాలు కాకుండా చిన్న తరగతుల వారికి ఇంగ్లీషులో చిత్రాల ద్వారా కృత్యాలు నేర్పడం, గేమ్స్, లెసన్స్ సంబంధించిన వర్క్ బుక్ లాంటివి చిన్న చిన్న పదాలు అర్థమయ్యేలా నేర్పించాలని అన్నారు. మండలంలో అంజనాపురం,మొరంపల్లి బంజర్, బూర్గంపాడు, నాగినేని ప్రోలు, సారపాక లోని గాంధీనగర్ పాఠశాలలో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారని ఎంఈఓ యదు సింహరాజు పీవో కి తెలిపారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాసరావు, ఫ్యాకల్టీలు లక్ష్మీ ప్రసన్న, గోపాలరావు, శ్రీనివాసరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.