calender_icon.png 16 March, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లో బోధనను ప్రభావవంతంగా తీర్చిదిద్దాలి

15-03-2025 08:12:03 PM

కలెక్టర్ బి.యం.సంతోష్...

గద్వాల (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం ద్వారా బోధనను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దుతున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తెలిపారు. శనివారం ఎర్రవల్లి మండలంలోని కొండేర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎఫ్.ఎల్.ఎన్ ఏఎక్స్ఎల్ కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించి,విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. AI ఆధారిత బోధన పద్ధతులను వీక్షించి, ఉపాధ్యాయులకు సూచనలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థుల అభ్యాసాన్ని ఆకర్షణీయంగా, ఇంటరాక్టివ్‌గా మార్చేందుకు AI కీలకంగా సహకరిస్తుందని అన్నారు.

విద్యార్థుల స్థాయిని అంచనా వేసి,వారికి అనుకూలమైన అభ్యాస విధానాలను రూపొందించి, బోధనను మరింత ప్రభావవంతంగా చేస్తుందని పేర్కొన్నారు.26 ప్రభుత్వ పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా AI తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఫౌండషనల్ లిటరసీ, న్యూమెరసీ ప్రాథమిక విద్యా స్థాయిలో ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ఆధారిత డిజిటల్ పద్ధతుల ద్వారా ప్రాథమిక స్థాయిలో రాయడం, చదవడం, సంఖ్యా పరమైన విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారని తెలిపారు. పాఠశాలల్లో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పూర్తి స్థాయి ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థుల కోసం సమర్థవంతంగా ఉపయోగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహీల్దార్ నరేష్, ఎంఈవో అమీర్ పాష, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, జిల్లా కోఆర్డినేటర్ ఎస్తర్ రాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.