calender_icon.png 28 February, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటెత్తిన ఉపాధ్యాయులు

28-02-2025 02:34:38 AM

  1. కామారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 94. 74% పోలింగ్
  2. పట్టభద్రుల ఎమ్మెల్సీకి 77.0 4% పోలింగ్
  3. ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యేలు, కలెక్టర్లు  మాజీ ఎమ్మెల్యేలు

కామారెడ్డి ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అధికారులు పోలింగ్ నిర్వహించారు. ఉపాధ్యాయులు పట్టబద్రులు తమ ఓటు హక్కును చివరి సమయం వరకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకు న్నారు. కామారెడ్డి లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్, అదనపు కలెక్టర్ లు శ్రీనివాస్ రెడ్డి, విక్టర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, ఓటు వేశారు. బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి తాడ్వాయిలో తన ఓటు హక్కును వినియోగించు కున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే పిట్లంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ 10 గంటల వరకు పట్టబద్రులు 5.5% ఉపాధ్యాయులు 7.66% శాతంగా నమోదు అయింది. మందకోడిగా సాగింది.

11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉపాధ్యా యులు పట్టబద్రులు తమ ఓటు హక్కు వినియోగించు కునేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలింగ్ శాతం అమాంతంగా పెరిగింది. ఉపాధ్యాయులు 38.38% శాతం పట్టభద్రులు 24.24% ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యా హ్నం రెండు గంటల వరకు పట్టభద్రులు 47.43% శాతం ఉపాధ్యాయులు 64.74% ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మధ్యాహ్నం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పట్టభద్రులు 56.09% శాతం ఉపాధ్యాయులు 67.33% ఓటు హక్కు వినియోగించు కున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి పట్ట బద్రులు 78.12 శాతం 11,616 ఓట్లకు గాను 9,127 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యాయులు 93.63% శాతం కాగా 1307 ఓట్లకు గాను 1216 ఓట్లు పోలయ్యాయి. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రా నికి పోలింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ తో పాటు మరో ఇద్దరు సిబ్బందిని నియమించారు.

తమక అప్పగించిన ఎన్నికల సామాగ్రి తో పాటు ఓటింగ్ డబ్బాలను సిల్  చేసి పోలీస్ బందోబస్తు మధ్య అధికారు లకు అప్పగించారు. ఎన్నికలను జిల్లా ఎస్పీ సింధు శర్మ అడిషనల్ ఎస్పీలు చైతన్య రెడ్డి నరసింహారెడ్డి లతోపాటు డీఎస్పీలు సిఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.  కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన27 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లతో కలిపి 54 పోలింగ్ కేంద్రాలలో ఎన్ని కలు జరిగినట్లు తెలిపారు.

ఉపా ధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ విధిస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. పోలింగ్ కేంద్రాల నుంచి సిల్ చేసిన పోలింగ్ బాక్సులను పోలీస్ బందోబస్తు మధ్య గోదాములకు తరలించడం జరిగింది అన్నారు.

జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ కు సహకరించిన పట్టబద్రులు ఉపాధ్యాయులకు వివిధ పార్టీల నాయకులకు అభినందనలు ఎస్పీ తెలిపారు. ఎస్పీ సింధు శర్మతో పాటు అడిషనల్ ఎస్పీలు చైతన్య రెడ్డి నరసింహారెడ్డి డిఎస్పీలు శ్రీనివాసులు సత్యనారాయణ సిఐలు ఎస్త్స్రలు పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.

నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసనమండలి ఉపాధ్యాయ పట్టబద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఓటింగ్ నిర్వహణ జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

జిల్లా వ్యాప్తంగా 81 కేంద్రాలను ఏర్పాటు చేయగా పట్టబద్ధులు ఉపాధ్యాయుల ఓటర్లు ఉదయం నుండి ఓటింగ్లో పాల్గొనీ మా ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు పోలింగ్ కేంద్రాలలో ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది మొదటి రెండు గంటల వరకు ఒక మోస్తారుగా సాగిన ఓటింగ్ అనంతరం ఓటింగ్ అధిక శాతం లో జరిగింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా జిల్లా కేంద్రంలో ఏసీబీ రాజా వెంకటరెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో మొదటి రెండు గంటలు ముగిసే సమయానికి ఉదయం 10 గంటల వరకు 9.5% ఉపాధ్యాయ నియోజకవర్గం కు సంబంధించి జరిగింది 15. 9 7% పోలింగ్ నమోద యిందని అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల సమయానికి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 27.44% శాతం ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 42. 12% పోలింగ్ నమోదయిందని నిర్వహణ అధికారులు తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం జిల్లాలో రెండు గంటల సమయానికి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 49.93% ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 66.22 శాతం పోలింగ్ నమోదయింది. నిజామాబాద్ జిల్లాలో 1993 ఓట్లు పురుషులు ఉండగా 11581 మహిళా ఓటర్లు ఉన్నారు మొత్తం కలిపి 31 597 ఓట్లు ఉన్నాయి. తెలంగాణలో మూడు స్థానాల పోలింగ్ రెండు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఒకటి ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ వచ్చేనెల మూడు జరగనుంది.

ఉపాధ్యాయ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకు న్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని కలెక్టర్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాలలో పోలింగ్ బూత్ ఒక 102లో కలెక్టర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అవసరమైన ప్రతి పోలింగ్ స్టేషన్‌ని కలెక్టర్ సందర్శించి తగు జాగ్రత్తలు తీసుకోవా ల్సిందిగా సంబంధిత సిబ్బందిని పిసులకు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఓటింగ్ ప్రక్రియ ను నిశితంగా పరిశీలించారు. జిల్లా సమీకృత కలెక్టర్ భవన సముదాయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాజీవ్ గాంధీ హనుమంతు పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

ఇతర అధికారులతో కలిసి వెబ్ కాస్టింగ్ ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలలో నెలకొని ఉన్న పరిస్థితులను పర్యవేక్షిస్తూ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు. పోలింగ్ పూర్తి అయిన అనంతరం కట్టుదిట్ట మైన భద్రత ఏర్పాట్ల మధ్య బ్యాలెట్ బాక్స్ లను ప్రత్యేక వాహనాలలో కరీంనగర్ లోని రిసెప్షన్ సెంటర్ కు ప్రత్యక్షంగా పర్యవేక్షించి జిల్లా కలెక్టర్ పంపించారు.

92.46% పోలింగ్ నమోదు 

నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  సాయంత్రం 4 గంటల సమయానికి ఉపాధ్యాయ సెగ్మెంట్ సంబంధించి జిల్లా యంత్రాంగం ప్రకటించిన విధంగా 92.46శాతం పోలింగ్ నమోదు జరిగింది. తదుపరి ప్రక్రియ కొనసాగుతోంది ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ఓటు వేసిన  ఎమ్మెల్యే లు భూపతిరెడ్డి,  లక్ష్మీకాంతరావు 

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్* సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు నిజామాబాద్ నగరంలో ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ లో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పిట్లంలో జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

ఓటు వేసిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌కుమార్

మెండోర, ఫిబ్రవరి 27: (విజయ క్రాంతి) : మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలొ గల పోలింగ్ స్టేషన్ నందు మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్. ఈ సందర్భంగా పట్టభద్రులు విచక్షణతో ఆలోచించి పోలింగ్ స్టేషన్ లకు తరలివెళ్లి తమ ఓటు హక్కును వినియోగించు కోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్లు

కామారెడ్డి, ఫిబ్రవరి 27( విజయక్రాంతి), పట్టభద్రుల ఓటు హక్కును కామారెడ్డి జిల్లా కలెక్టర్ అసిస్ సంగు వన్ గురువారం బాలుర ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు జిల్లా ఎస్పీ సింధు శర్మ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఓటింగ్ సరళిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నిజామాబాద్: నిజామాబాద్, కరీంనగర్, ఆదిలా బాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నిజామా బాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన ఓటు హక్కును వినియోగించు కున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల ఎస్.ఎఫ్.ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలిం గ్ స్టేషన్ నెం 122 లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓటు వేశారు. జిల్లాలో మొదటి రెండు గంటలు ముగిసిన సమయానికి (ఉదయం 10 గంటలకు) పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 9.5 శాతం, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15.97 శాతం పోలింగ్ నమోద య్యిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందని తెలిపారు.

స్లిప్పుల అందజేత

బిచ్కుంద, ఫిబ్రవరి 27: (విజయక్రాంతి) : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం బీజేపీ నాయకులు గురువారం మద్నూర్ మండల కేంద్రంలో ప్రయత్నించారు. ఓటు వేసేందుకు వచ్చిన వారికి ఓటర్ స్లిప్పులను రాసి ఇచ్చారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం సహకరించాలని కోరారు. మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో బీజేపీ నాయకులు అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్లను వేడుకుంటూ ..ఓట్లు వేసి బీజేపీ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

మద్నూర్ మండల కేంద్రంలో జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణా తార సందర్శించి పోలింగ్ వివరాలను నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం పోలింగ్ సమయం ముగిసే వరకు బీజేపీ నాయకులు మద్నూర్ పాత బస్టాండ్ వద్ద కూర్చొని ఓటు వేసేందుకు వచ్చే వారికి సీరియల్ నెంబర్ స్లిప్పులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలనాయకులు పాల్గొన్నారు.

మందకొడిగా ప్రారంభించి.

ఆర్మూర్, ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి) : నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆర్మూర్ డివిజన్ పరిధిలో గురువారం ప్రశాతంగా ముగిసింది. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 13 మండలాలు ఆర్మూర్, ఆలూర్, నందిపేట, డొంకేశ్వర్, జక్రాన్పల్లి, బాల్కొండ, వేల్పూర్, భీమ్గల్, కమ్మర్పల్లి, ఏర్గట్ల, మోర్తాడ్, ముప్కాల్, మెండోర ఉన్నాయి. ఆయా మండలాల పరిధిలో ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్ పర్యవేక్షణలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు.

ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి అర్హులైన ఓటర్లు  1,049 మంది ఉండగా, పట్టభద్రుల ఎమ్మెల్సీకి అర్హులైన ఓటర్లు  12,196 మంది  ఉన్నారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో 990 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 94.38 శాతం, పట్టభద్రుల ఎమ్మెల్సీలో 9,357 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 76.70 శాతం పోలింగ్ నమోదైంది. పూర్తి నివేదిక అనంతరం ఈ గణాంకాల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

ఎన్నికల్లో పాల్గొన్న యువకులు

ఏర్గట్ల, పిబ్రవరి 27 :(విజయ క్రాంతి ) నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల  టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  భాగంగా మండల కేంద్రం ఏర్గట్ల జడ్పి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో గురువారం నిర్వహించిన పోలింగ్ లో టీచర్, గ్రాడ్యుయేట్ లు మూడు వందల నాలుగు  మంది ఓటర్లు ఉండగా మొత్తం రెండు వందల నలభై తొమ్మిది మంది ఓటర్లు తమ ఓట్లను వినియోగించుకున్నారు. పురుషులు నూట అరవై ఏడు మంది, మహిళలు ఏనాబాయి రెండు మంది ఓటర్లు వారి ఓట్లను వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.

పెద్ద కొడఫ్గల్ ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి) :కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్  మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన  పోలింగ్ కేంద్రం లో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఎన్నికల సరళిని పరిశీలించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని 100% ఓటింగ్ కు సహకరించాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ దశరథ్ ఎంపీడీవో లక్ష్మి కాంత్ రెడ్డి ఎస్త్స్ర మహేందర్ ఎన్నికల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పోలింగ్ సమయం ముగిసేసరికి బూత్ నంబర్ 111లో 100%(18/18) ఉపాధ్యాయులు ఓటును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. అదేవిధంగా బూత్ నంబర్ 166లో పట్టభద్రులు 67.30%(142/211) ఓటును వినియోగించుకున్నట్లు వివరించారు.