calender_icon.png 2 April, 2025 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాతృత్వం చాటుకున్న ఉపాధ్యాయులు

21-03-2025 12:00:00 AM

ఎల్లారెడ్డి, మార్చ్ 20 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని వెల్లుట్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గురువారం ప్రస్తుత ఎల్లారెడ్డి మండల పి ఆర్ టి యు అధ్యక్షులు,జెడ్ పిబిహెచ్‌ఎస్ ఎల్లారెడ్డి పాఠశాలలో  స్కూలు  అసిస్టెంట్ గణిత ఉపాధ్యాయులు పట్లోళ్ల శ్రీనివాస్, లింగారెడ్డి పేట్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాశీరాం ఇరువురు కలిసి హెడ్ మాస్టర్ టేబుల్ ను బహూకరించడం జరిగింది.

అలాగే వెల్లుట్ల పాఠశాలలో విధులు నిర్వహించి జూన్ 2024లో ఈ పాఠశాల నుండి రిటైర్ అయిన పోచాగౌడ్ S.A(సోషల్) పాఠశాలకు బీరువా బహూకరించారు. ఈ ముగ్గురికి వెల్లుట్ల పాఠశాలతో మంచి అనుబంధం ఉన్నదని,ఎందరో విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిన ఘనత వారిదని వారి సేవలను కొనియాడుతూ ఆ ఉపాధ్యాయులకి ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర రావు, ఉపాధ్యాయ బృందం, విధ్యార్థులు,మరియు గ్రామస్తుల తరపున ప్రత్యేకం గా కృతఙ్ఞతలు తెలియజేశారు.