calender_icon.png 31 October, 2024 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకెనపల్లె ఫిజికల్ డైరెక్టర్ ను సన్మానించిన ఉపాధ్యాయులు

30-08-2024 11:53:37 AM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లె జిల్లా పరిషత్ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ ఎస్.కె రాజ్ మహ్మద్ ను జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ప్రధానోపాధ్యాయులు సాధు లింగయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు తనను సన్మానించడం ఆనందాన్ని మిగిల్చిందని ఫిజికల్ డైరెక్టర్ రాజ్ మహ్మద్ అన్నారు. అంతర్జాతీయంగా పలు క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో అద్భుతాలు సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పక సాధన చేస్తే గొప్ప క్రీడాకారులుగా ఎదుగుతారన్నారు. చదువుతోపాటు క్రీడలు మంచి క్రమశిక్షణను నేర్పుతాయని విద్యార్థులకు సూచించారు. క్రీడల్లో ఇక్కడి విద్యార్థులు రాణించేలా కృషి చేస్తానన్నారు.