నల్లగొండ మైనారిటీ గురుకులంలో ఘటన
నల్లగొండ, జనవరి 31 (విజయక్రాంతి) : నల్లగొండ ఎస్సెల్బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు 7వ తరగతి విద్యార్థులను ఉపాధ్యాయులు చితక బాదారు. తమ పిల్లలను విచక్షణారహితంగా కొట్టారని శుక్రవారం తల్లిదండ్రులు పాఠ శాలకు వచ్చి ప్రిన్సిపాల్‌ను నిలదీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. తమ పిల్లలను వాతలు పడేలా కొట్టారని ఉపాధ్యా యులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు.
దీంతో పాఠశాలలో గందరగోళం నెలకొంది. ప్రిన్సిపాల్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయుల తీరుపై ఉన్నతాధికారుల ఫిర్యాదు చేస్తామని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్‌ను వివరణ కోరగా విద్యార్థులు క్రమశిక్షణ తప్పి ప్రవర్తించిన కారణంగానే ఉపాధ్యాయులు కొట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ప్రిన్సిపాల్‌ను పిలిచి వివరణ అడిగినట్లు తెలిసింది.