15-03-2025 11:27:02 PM
నాగల్ గిద్ద (విజయక్రాంతి): నాగల్ గీద్ద మండలం కరస్ గుత్తి కాంప్లెక్స్ పరిధిలోని చోక్లా నాయక్ తాండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తాలేరని తాండవాసులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒంటి పూట బడులు ప్రారంభం రోజునే ఉదయం 9 గంటలకు వరకు పాఠశాల తెరుచుకోలేక విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ఎదురుచూస్తున్నారు వారు ఇతర పనులో నిమగ్నమై పాఠశాలకు వస్తలేరని విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.