హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్న 27,862 ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అమలు చేయడమనేది గొప్ప విషయమని పలు ఉపాధ్యా య సంఘాల నేతలు తెలిపారు. గురువారం రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఉచిత విద్యుత్‌కు సంబంధించిన జీవో కాపీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై పీఆర్టీయూటీఎస్, టీఆర్టీఎఫ్, హెచ్‌ఎం అసోసి యేషన్, టీపీయూఎస్, పీఆర్టీయూ తెలంగాణ, ఎస్టీయూటీఎఫ్, ఎస్టీయూటీఎస్ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.