గజ్వేల్,(విజయక్రాంతి): జాతీయ యువజన దినోత్సవం(National Youth Day), స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గజ్వేల్ లోని స్వామి వివేకానంద విగ్రహానికి పిఆర్టియు గజ్వేల్ మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు వంటేరు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. స్వామి వివేకానంద భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను, హైందవ ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప నాయకుడని, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన దేశ యువతపైన భారతదేశం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. ఆ దిశగా యువతి యువకులు ముందుకు నడవాలని, బలమే జీవితం.. బలహీనతే మరణమన్న స్వామి వివేకానంద మాటలను గుర్తుకు తెచ్చుకొని దేశ భవిష్యత్తుకు పునాదులు వేయాలని నేటి యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎండి బషీరుద్దీన్, కే నరసింహారెడ్డి, పి బాలు చరణ్, పి శివశంకర్, ఏ శేఖర్, జి శ్రీనివాస్ భాస్కర్, మండల ఉపాధ్యక్షుడు బి నరసింహారెడ్డి, కార్యదర్శి దిలీప్ కుమార్, సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, బి.మహేష్, బి. కాశినాదం, శ్రీరామ్, శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, దామోదర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.