calender_icon.png 19 April, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో165 మంది టీచర్ల బదిలీలు!

17-04-2025 01:02:49 AM

స్పౌజ్ క్యాటగిరీ కింద ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో స్పౌజ్ క్యాటగి రీ (భార్యాభర్తలు) కింద మరో 165 మంది ఉపాధ్యాయుల బదిలీలను ప్రభుత్వం చేపట్టింది. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెం.317 ద్వారా నష్టపోయిన వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసి గత జనవరిలో మొత్తం 834 మంది ఉపాధ్యాయులను కోరుకున్న జిల్లాలకు బదిలీ చేసి భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించిన సంగతి తెలిసిందే.

అయితే కొన్ని తప్పిదాలు, సాంకేతిక కారణాల వల్ల మరికొంత మంది మిగిలిపోయారు. వాటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 165 మంది బదిలీలకు అనుమతినిస్తూ జీవో జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ అధికారులు బదిలీల జాబితాను డీఈవోలకు పంపించారు. ఏప్రిల్ 22న రిలీవై 23న వారికి కేటాయించిన జిల్లాలోని పాఠశాలల్లో వీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.