28-02-2025 06:20:48 PM
మణుగూరు (విజయక్రాంతి): గిరిజన చిన్నారులకు విద్యను బలోపేతం చేయడానికి ఎన్నో సంస్కరణలు చేపట్టడం జరిగిందని, ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసుకోని కనీసం చిన్నారులు తెలుగు, ఇంగ్లీషులో తమ పేర్లు రాసుకోలేని పరిస్థితి ఉందని ఉపాధ్యాయులు పిల్లలు రాసే పదాలు తప్పులు లేకుండా సక్రమంగా రాసేలా చర్యలు తీసుకోవాలని పిఓ బి. రాహుల్ సంబంధిత ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం మణుగూరు మండలంలోని గుట్ట మల్లారం గిరిజన సంక్షేమ శాఖ ఇంగ్లీష్ మోడల్ జిపిఎస్ పాఠశాల, పగిడేరులోని ఎస్టీ కాలనీలో ఉన్న జిపిఎస్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లల చేత బోర్డుపై అక్షరమాల, అధికారుల పేర్లు ఎలా రాయాలో పిల్లల చేత రాయించారు.
పిల్లలు సరిగా రాయడం చదవడం పట్ల వెనుకబడి ఉన్నారని గ్రహించి కనీసం పిల్లలకు అక్షరమాలకు సంబంధించిన అక్షరాలు తప్పులు రాయడం, ఇంగ్లీష్ పదాలు సరిగా రాయకపోవడం బాలశిక్ష పుస్తకాలలోని పాఠ్యాంశాలను చదవడంలో కొందరు పిల్లలు వెనుకబడి ఉన్నారని అందుకు ఉపాధ్యాయులు పిల్లలందరూ తప్పులు లేకుండా రాసేలా చూడాలని, సంబంధిత ఎస్ సి ఆర్ పి ల పర్యవేక్షణ సక్రమంగా ఉండాలని, జిపిఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు ఏ విధంగా బోధిస్తున్నది పరిశీలించాలని అన్నారు. ఉద్దీపకం వర్క్ బుక్స్ తప్పనిసరిగా విద్యార్థులకు చదవడం రాయడం వచ్చే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీడీవో అశోక్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.