calender_icon.png 16 January, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్లు మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలి

06-09-2024 12:00:00 AM

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ 

వికారాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాం తి): టీచర్లు మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులకు విద్యాబోధన చేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. వికారాబాద్ కలెకరేట్‌లో గురువారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిభాయి పూలే, బీఆర్ అంబేద్కర్ విద్యాప్రాధాన్యాన్ని గుర్తించి సమాజానికి ఎంతో మేలు చేశారని గుర్తుచేశారు. రాష్ట్రప్రభుత్వం విద్యాశాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. ఈ బడ్జెట్లో రూ.21 వేల కోట్ల నిధులను కేటాయించిందని గుర్తుచేశారు. అనంతరం ఉత్తమ ఉపా ధ్యాయులను సన్మానించారు. కార్యక్రమం లో ఎమ్మెల్యేలు రాంమోహన్‌రెడ్డి, యాద య్య, మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, డీఈవో రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు.