09-02-2025 01:09:27 AM
ఎన్నికల కమిషనర్‌కు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య లేఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి అధ్యాపకులకు మినహాయింపునివ్వాలని ఎన్నికల అధి కారులకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య విజ్ఞప్తి చేశారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమి షనర్ రాణి కుముదినికి శనివారం లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్ష లు జరుగుతున్నాయని, మార్చి 5 నుంచి 25 వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయని లేఖలో పేర్కొన్నా రు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని అధ్యాపకులు ఎన్నికల విధుల్లో పాల్గొంటే, విద్యాబోధనకు బ్రేక్ పడడంతోపాటు పరీక్షలను సాఫీగా నిర్వహించలేమ ని, ఇబ్బందులు ఎదుర్కోవలసి వ స్తుందన్నారు. అందుకే ప్రభుత్వ, ప్రభుత్వరంగ జూనియర్ కాలేజీల్లోని సిబ్బందికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపునివ్వాలని లేఖలో కోరారు.