calender_icon.png 30 October, 2024 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంతో టీచర్లు సమావేశానికి తరలిరావాలి

30-07-2024 01:31:14 AM

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారని పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన దాదాపు 30వేల మంది ఉపాధ్యాయులతో ఆగస్టు 2న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో సీఎం నేరుగా మాట్లాడుతారన్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు సమావేశానికి టీచర్లు పెద్దసంఖ్యలో హాజరు కావాలని వారు కోరారు.